Karnataka CM 2021: నూతన సీఎంగా బసవరాజు బొమ్మై ?

Karnataka CM 2021: కాసేపట్లో అధికారిక ప్రకటన * మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడు బసవరాజు బొమ్మై

Update: 2021-07-27 12:16 GMT

కర్ణాటక సీఎంగా బసవరాజు బొమ్మై (ఫోటో ది హన్స్ ఇండియా)

Karnataka CM 2021: కర్నాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామాతో నూతన సీఎం ఎంపికపై కమలనాధులు కసరత్తు వేగం పెంచారు. రాత్రి ఏడుగంటలకు బెంగళూరులో బీజేపీ శాసనసభా పక్షం జరుగుతుంది. యడియూరప్ప వారసుడి కోసం బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది.అయితే లింగాయత్ సామాజిక వర్గానికే సీఎం పదవి దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కన బసవరాజు బొమ్మై పేరు తెరపైకి వచ్చింది.. మాజీ సీఎం ఎస్ఆర్.బొమ్మ కుమారుడు బసవరాజ్ బొమ్మై.

సీఎం రేసులో ప్రహ్లాద్ జోషి, బీ.ఎల్. సంతోష్, విశ్వేశ్వర హెగ్డే కాగేరి, సిటీ రవి, సదానందగౌడ్, బసవరాజు బొమ్మై, జగదీష్ శషెట్టర్ తో పాటు ఇతరుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, సామాజిక బలం, నాయకత్వ లక్షణాలు ఉన్న నేతను గుర్తించేందుకు హస్తినలో ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు జరిపారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కర్నాటక పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తిగా మారింది.

కర్నాటక రాజకీయ వ్యవహారంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ లను కేంద్ర పరిశీలకులుగా పార్టీ నిర్ణయించింది. బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలతో వీరు చర్చలు జరపనున్నారు. శాసనసభా పక్ష సమావేశం అనంతరం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.  

Full View


Tags:    

Similar News