Dream11: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సెలూన్ నిర్వాహకుడు
Dream11: అదృష్టం ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో ఎవరికీ తెలియదు.
Dream11: అదృష్టం ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో ఎవరికీ తెలియదు. లక్ ఉంటె ఒక్కరోజులోనే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడు కావవచ్చు. ఓ సెలూన్ నిర్వాహాకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధుబనీ జిల్లాలో సెలూన్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ఠాకుర్‌కు 'డ్రీమ్-11' రూపంలో అదృష్టం తలుపు తట్టింది. అశోక్ కుమార్‌కు ఓ సెలూన్ ఉంది. ఆ దుకాణమే అతడికి జీవనాధారం. క్రికెట్‌పై ఆసక్తితో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 'డ్రీమ్-11'లో అశోక్ తరచూ బెట్టింగ్ పెట్టేవాడు.
ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌పైనా బెట్టింగ్ పెట్టాడు. కేవలం 50 రూపాయలతో కోటి రూపాయల కాంటెస్ట్‌లో పాల్గొన్నాడు. ఐతే ఆ రోజు అనూహ్యంగా అతడే విజేతగా నిలిచాడు. కోటి రూపాయల కాంటెస్ట్‌లో మొదటి స్థానంలో నిలవడంతో రూ.కోటి ప్రైజ్ మనీ అతడిని వరించింది.
ఈ విషయం తెలియగానే అశోక్ ఆనందానికి అవధులు లేవు. గతంలో ఎన్నోసార్లు బెట్టింగ్ పెట్టానని, ఎప్పుడూ గెలవలేదని ఈ సందర్భంగా అశోక్ చెప్పాడు. కానీ ఇప్పుడు కోటి రూపాయలు రావడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.