India Economy: మూడవ ఆర్దిక వ్యవస్థగా ఇండియా ఆవిర్భవించనుందా?
India Economy: కరోనా ప్రతికూలతలు భారత్ వృద్ధి వేగాన్ని అడ్డగించాయని వివరించింది.
India Economy: 2031-32 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. నాటికే భారత్ ఈ స్థాయిని అందుకోవాల్సి ఉంది. అయితే కరోనా ప్రతికూలతలు భారత్ వృద్ధి వేగాన్ని అడ్డగించాయని వివరించింది.
భారత్ లో యువత అధికంగా ఉండడం.. ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిపక్వత భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలని రిపోర్ట్ వివరించింది. గడచిన ఎనిమిది సంవత్సరాలుగా RBI సమర్థవంతమైన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలను నిర్వహిస్తోందని తెలిపింది. బ్యాంకింగ్ మొండి బకాయిల సమస్య పరిష్కారంలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ఆలోచన మంచి ఫలితాలను అందిస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక వివరించింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక రంగంలో మొదటి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్‌లు కొనసాగుతున్నాయి.