Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సెక్యూరిటీ ప్రింటింగ్‌లో జూనియర్ టెక్నీషియన్ పోస్టులు..

Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి ఇది శుభవార్తే అని చెప్పాలి...

Update: 2022-03-02 04:41 GMT

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సెక్యూరిటీ ప్రింటింగ్‌లో జూనియర్ టెక్నీషియన్ పోస్టులు..

Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకి ఇది శుభవార్తే అని చెప్పాలి. భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్ (MP) జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం తదితర వివరాలు తెలుసుకుందాం.

మొత్తం ఖాళీల సంఖ్య 81 జూనియర్‌ టెక్నీషియన్ పోస్టులు. ఈ పోస్టులకి అభ్యర్ధుల వయసు 18నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. డిప్యూటీ టెక్నాలజీ/పెయింట్‌ టెక్నాలజీ/పర్ఫేస్‌ కోటింట్‌ టెక్నాలజీ/ప్రింటింగ్‌ ఇంక్‌ టెక్నాలజీ/ప్రింటింగ్‌ టెక్నాలజీ/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/లిథో ఆఫ్‌సెట్‌ మెషిన్‌ మైండర్‌/లెటర్‌ ప్రెస్‌ మెషిన్‌ మైండర్‌/ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌/ప్లేట్‌ మేకింగ్‌/ఎలక్ట్రోప్లాటింగ్‌లో ఐఐటీ సర్టిఫికేట్‌తోపాటు ఎన్‌సీబీటీ నుంచి నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికేట్‌ కూడా కలిగి ఉండాలి.

రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఏప్రిల్/మే 2022లో ఆన్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం125 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. 120నిముషాల పాటు పరీక్ష రాయవల్సి ఉంటుంది. టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ.600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు: రూ.200 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 28, 2022గా నిర్ణయించారు.

Tags:    

Similar News