Bank Holidays: మే నెలలో 12 రోజులు బ్యాంక్స్ బంద్
Bank Holiday's:ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం బ్యాంకులకు మే నెలలో 12 రోజులు సెలవులు ఉన్నాయి.
Bank HoliDays: మే నెలలో మీకు బ్యాంకులకు వెళ్ళాల్సిన పనులు ఏవైనా ఉంటే ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ నెలలో బ్యాంకులకు ఎక్కువగానే సెలవులు ఉన్నాయి. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఇప్పటివరకు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరుస్తున్నారు. ఇలాంటి సమయంలో బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుంటే మరింత మంచిది.
మే 1, 2021న మే డే/ లేబర్ డే May Day, మే 2న ఆదివారం కావడం.. మే 7, 2021 జుమత్ ఉల్ విదా, మే 8, 2021 రెండో శనివారం, మే 9, 2021 ఆదివారం అలాగే..మే 13, 2021 రంజాన్, మే 14, 2021 భగవాన్ శ్రీ పరశురామ్ జయంతి/Akshaya Tritiya, మే 16, 2021ఆదివారం, మే 22, 2021 నాలుగో శనివారం, మే 23, 2021 ఆదివారం, మే 26, 2021 బుద్ధ పూర్ణిమ, మే 30, 2021 ఆదివారం ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం బ్యాంకులకు మే నెలలో 12 రోజులు సెలవులు ఉన్నాయి.