ప్రేమ కోసం.. సాహసం.. నదిని ఈదుతూ బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు.. కట్ చేస్తే.. యువతికి షాకిచ్చిన పోలీసులు..

Bangladesh woman: ప్రేమ కోసం ఎందరో ఎన్నో సాహసాలు చేయడం మనం చూసే ఉంటాం వినే ఉంటాము కానీ ఓ 22 ఏళ్ల యువతి మాత్రం చేసిన సాహసం వింటే మాత్రం ముక్కున వేలేసుకుంటారు.

Update: 2022-06-03 13:00 GMT

ప్రేమ కోసం.. సాహసం.. నదిని ఈదుతూ బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు.. కట్ చేస్తే.. యువతికి షాకిచ్చిన పోలీసులు..

Bangladesh woman: ప్రేమ కోసం ఎందరో ఎన్నో సాహసాలు చేయడం మనం చూసే ఉంటాం వినే ఉంటాము కానీ ఓ 22 ఏళ్ల యువతి మాత్రం చేసిన సాహసం వింటే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. ప్రియుడితో కలిసి ఏడుగులు నడిచేందుకు ఏకంగా నది ప్రవాహానికి ఎదురీదింది. పులులు, ఇతర భయంకరమైన మృగాలు తిరుగాడే అడవుల్లో నుంచి దేశ సరిహద్దులనే దాటి వచ్చింది. ఎట్టకేలకు ప్రియుడిని కలిసి పెళ్లి చేసుకుంది. కానీ అసలు కథ అప్పుడే మొదలయ్యింది. ఆమె సాహస గాథ తెలుసుకున్న పోలీసులు దేశంలోకి అక్రమంగా చొరబడినందుకు అమెను అరెస్టు చేశారు.

కల్మషం లేని ప్రేమ.. ప్రేమికులతో సాహసం చేయిస్తుంది. బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండల్‌ కూడా అలాంటి సాహసానికే దిగింది. ఈ 22 ఏళ్ల యువతి ఆరు నెలల క్రితం కోల్‌కతాకు చెందిన అభిక్‌ మండల్‌ అనే యువకుడితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దిరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమను పరిపూర్ణం చేసుకునేందుకు పెళ్లాడాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. కోల్‌కతాలో ఉన్న ప్రియుడిని కలుసుకోవాలని మూడు ముళ్లు వేయించుకుని ఏడడుగులు నడవాలని కృష్ణ భావించింది. ఆమె భారత్‌కు రావాలంటే పాస్‌పోర్టు, వీసా అవసరం. అవి అధికారికంగా పొందాలంటే ఖర్చుతో కూడున్నపని పైగా సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. దీంతో సరిహద్దులు దాటుకుని రావడానికి కృష్ణ సిద్ధపడింది.

పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో విస్తరించిన సుందర్‌బన్స్‌ అడవులు బెంగాల్‌ పులులకు ఆలవాలం. ఈ దుర్బేధ్యమైన అడవుల్లో పులులతో పాటు భయంకరమైన మృగాలు కూడా ఉంటాయి. ఈ అడవిలోకి గుండె ధైర్యం ఉన్నవారే వెళ్లడానికి జంకుతారు. అయితే కృష్ణ భారత్‌లోకి రావడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది. ప్రేమించినోడి కోసం ధైర్యంగా ఆడవిని దాటుకుని వచ్చింది. ఎలాగోలా అడవిని దాటుకు వచ్చినా మట్లా నది ప్రవాహానికి గంటకు పైగా ఎదరు ఈదింది. ఈ నదిలో భారీ మొసళ్లు ఉంటాయి అయినా వెరవకుండా చివరికి బెంగాల్‌లోని దక్షిణ 24న పరగణ జిల్లాలోని ఖైఖలీలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ప్రియుడు అభిక్‌తో కలిసి కారులో కలకత్తాకు చేరుకుంది. మూడ్రోజుల క్రితం కృష్ణ మండల్‌, అభిక్‌ మండల్‌ కాళీఘాట్‌ ఆలయంలో పెళ్లి చేైసుకుని ఒక్కటయ్యారు. దేశ సరిహద్దులు దాటి వచ్చి ఎట్టకేలకు కృష్ణ తన ప్రేమను దక్కించుకున్నది.

ప్రేమికుల పెళ్లితో కథ సుఖాంతం కాలేదు. అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. ఇద్దరు ప్రేమికులు కలుసుకోవడం కృష్ణ మండల్‌ సాహసాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ఆనోటా ఈ నోటా పోలీసులకు తెలిసింది. అయితే దేశంలోకి అక్రమంగా చొరబడిన ఆమెను నరేంద్రపూర్‌ ఠాణా పోలీసులు అమెను అరెస్టు చేశారు. కృష్ణ మండల్‌ను బంగ్లాదేశ్‌ హై కమిషన్‌కు అప్పగిస్తారని సమాచారం. కాగా గతంలోనూ పలుమార్లు ఇలా సోషల్‌ మీడియాలో పరిచమైన వారు ప్రమికుల కోసం సరిహద్దులు దాటి భారత్‌లో ప్రవేశించిన సంఘటనలు చాలానే జరిగాయి. కానీ దుర్బేధ్యమైన, వన్య మృగాలున్న సుందర్బన్‌ అడవులను దాటుకుని మట్లా నదిని ఎదురీది రావడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు.

గతేడాది కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. పశ్చిమ బెంగాల్‌ నాడియా జిల్లా బల్లవ్‌పూర్‌ గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు బంగ్లాదేశ్‌లోని నెరైల్‌కు చెందిన 18 ఏళ్ల ప్రియురాలిని కలుసుకునేందుకు బయలుదేరాడు. చివరికి యువతిని తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. నాడియా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆ జంటను బీఎస్‌ఎఫ్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరి కూడా సోషల్‌ మీడియాలో పరిచయం అయ్యి.. ప్రేమగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలోనూ బంగ్లాదేశ్‌ యువకుడు ఇమాన్‌ హొసైన్‌.. చాక్లెట్‌ కోసం నదిని ఈదుతూ పశ్చిమబెంగాల్‌లో వచ్చేవాడు. అయితే చివరికి అతడు పోలీసులకు పట్టుబడ్డాడు. కోర్టు ఆదేశాలతో 15 రోజుల జుడీసియల్‌ రిమాండ్‌కు బాలుడిని తరలించారు.

Tags:    

Similar News