Supreme Court: బాణసంచా నియంత్రణ ఆదేశాలు ఢిల్లీకే కాదు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి
Supreme Court: టపాకాయలను నియంత్రించే ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి
Supreme Court: టపకాయల నియంత్రణ పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టపకాయలను నియంత్రించే ఆదేశాలు ఢిల్లీకే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని పేర్కొంది. బాణసంచాలో బేరియం , నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమంతటా వర్తిస్తాయని తెలిపింది. ఈమేరకు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
బేరియం క్రాకర్స్‌పై నిషేధం, పండుగల సమయంలో వాయు, శబ్ధ కాలుష్యాన్ని తగ్గించడంపై అపెక్స్ కోర్టు ఆదేశాలను పాటించేలా రాజస్థాన్ రాష్ట్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాజస్థాన్ సహా అన్ని రాష్ట్రాలు పండుగ సీజన్‌లోనే కాకుండా వాయు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపింది.