Bambiha Gang: లారెన్స్ బిష్ణోయ్ హత్యకు బంబిహా గ్యాంగ్ ప్లాన్

Bambiha Gang: లారెన్స్ బిష్ణోయ్ హత్యకు బంబిహా నాయకుడు కుశాల్ చౌధ్రీ కుట్ర పన్నారని ఇండియాటుడే తెలిపింది.

Update: 2024-10-30 09:35 GMT

Bambiha Gang: లారెన్స్ బిష్ణోయ్ హత్యకు బంబిహా నాయకుడు కుశాల్ చౌధ్రీ కుట్ర పన్నారని ఇండియాటుడే తెలిపింది. తన అనుచరుడు పవన్ షూకీస్ అలియాస్ సోనూతో కలిసి ఆయన ఈ ప్లాన్ చేశారు. అక్టోబర్ 26న దిల్లీ రాణీబాగ్ లోని ఓ వ్యాపారవేత్త ఇంటివద్ద జరిగిన కాల్పుల కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తే బిష్ణోయ్ హత్యకు ప్లాన్ చేసిన అంశం పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు అవసరమైన రూ. 15 కోట్లను సమకూర్చుకునేందుకు దిల్లీ వ్యాపారవేత్తను బెదిరించారు. నిందితుల నుంచి రెండు సెమీ ఆటోమెటిక్ ఆయుధాలను సీజ్ చేశారు.

2019లో కుశాల్ అరెస్ట్

థాయ్ లాండ్ లో కుశాల్ ను 2019లో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఇండియాకు తీసుకు వచ్చారు. సిద్దూమూసేవాల హత్యకు ప్రతీకారంగానే లారెన్స్ ను చంపుతానని కుశాల్ 2022లో సోషల్ మీడియాలో ప్రకటించారు. కుశాల్ పై ఎన్ఐఏ వరుసగా దాడులు నిర్వహించింది. ఇదిలా ఉంటే లారెన్స్ హిట్ లిస్ట్ లో కుశాల్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ విచారణలో ఆయన చెప్పారు. ఈ నెల 12న ముంబైలో బాబా సిద్దిఖీని లారెన్స్ గ్యాంగ్ సభ్యులు హత్య చేశారు. సల్మాన్ కు సన్నిహితంగా ఉన్నందునే చంపినట్టుగా చెప్పారు.

Tags:    

Similar News