Black Fungus: ఆ నీటి ద్వారానే బ్లాక్ ఫంగస్!
Black Fungus: ఆక్సిజన్ లో స్టెరైల్ వాటర్ బదులు సాధారణ నీటిని హ్యుమిడిఫయర్ ద్వారా అందించడం కూడా బ్లాక్ ఫంగస్ కు కారణమట.
Black Fungus: దేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసేస్తోంది. లక్షల సంఖ్యలో ఆ మహమ్మారి బారిన పడగా వందల సంఖ్యలో బలౌతున్నారు. ఆ మహమ్మారి బారిన పడి కోలుకున్నా కూడా ఏదో రూపంలో అనారోగ్యం కుంగదీస్తోంది. వాటిల్లో బ్లాక్ ఫంగస్ ఒకటి. బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుందో వైద్య నిపుణులు పరిశోధనల్లో అనేక ఆశక్తి అంశాలు బయటపడ్డాయి.
కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించేపుడు స్టెరైల్ వాటర్ బదులు సాధారణ నీటిని హ్యుమిడిఫయర్ ద్వారా అందించడం కూడా బ్లాక్ ఫంగస్ కు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై అహ్మదాబాద్ కు చెందిన సీనియర్ హృద్రోగ చికిత్స నిపుణులు డాక్టర్ అతుల్ అభ్యంకర్ మాటాలడుతూ బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ప్రధాన కారణం... ఆక్సిజన్ కు ఉపయోగించే భ్యుమిడిఫయర్లే. వాటిలో స్టెరైల్ నీటినే ఉపయోగించాలి. కానీ ప్రైవేటు ఆసుప్రతులు, కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారు సాధారణ నల్లా నీటిని వాడేస్తున్నారు. అందులో రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి.
వాటి కారణంగా శరీరంలో ఫంగస్ ఏర్పడుతోంది. 24 గంటల్లో రెండు సార్లు నీటిని మార్చాలి. ఎప్పటికప్పుడు హ్యమిడిఫయర్ ను శుభ్రం చేయాలి. అని సూచించారు. కోవిడ్ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఇస్తున్నారు. వాటి దుష్పభ్రావాల కారణంగా మ్యూకోర్ మైకోసిన్ దాడి చేస్తోంది. కళ్ళు, ముక్క, మెదడు, పళ్లపై ప్రభావం చూపుతోంది. దీంతో ఆ వ్యాధి వ్యాపించిన వెంటనే చికిత్స తీసుకోక పోతే ప్రాణాలు పోతున్నాయి. గుర్తించిన వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
బ్లాక్ ఫంగస్ కు అస్సలు కారణం ఏంటో తెలిసిపోయింది. ఇప్పటి నుండి అయినా శుభ్రతను పాటించి బ్లాక్ ఫంగస్ నుండి కాపాడుకుందాం. కరోనా బాధితులు ఆవుపేడను ఒంటికి పూసుకున్నా కూడా బ్లాక్ ఫంగస్ వస్తుందని నిపుణులు స్పష్టం చేశారు.