నేడు అయోధ్యకు బాలరాముడు

Ayodhya: ఊరేగింపుగా బాలరాముడి పరిసర ప్రవేశం

Update: 2024-01-17 03:14 GMT

నేడు అయోధ్యకు బాలరాముడు 

Ayodhya: ఏళ్లనాటి కళ సాక్షాత్కారవుతున్న వేళ... ప్రతి హిందూ కళ్లలో ఆనందం ఉట్టిపడే అపురూపం ఘట్టం.. వేల ఏళ్ల తర్వాత రామరాజ్య స్థాపన.. ఎప్పుడ్పుడా అని ఎదురుచూస్తున్న అద్బుతఘట్టం ఆయోధ‌్యలో ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలన్న హిందువుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. మరో 5 రోజుల్లో ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. కాగా.. నిన్నటి నుంచే ప్రారంభోత్సవ వేడుకలు ఆరంభమయ్యాయి. జనవరి 22 అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్టించనున్నారు. కాగా.. ఈరోజు అయోధ్యకు బాల రాముడు చేరుకోనున్నారు. ముగ్గురు శిల్పలు తయారుచేసినవాటిలో.. అరుణ్ యోగి రాజ్ రూపొందించిన విగ్రహాన్ని అంతిమంగా ఎంపిక చేసినట్టు రామ జన్మభూమి ట్రస్ట్ కార్యదర్శి వెల్లడించారు.

వనవాసం తర్వాత శ్రీరాముడు తిరిగి సొంతింటికి చేరుకోబోతున్నారన్న భావనను ప్రతి హిందూ భక్తుడి మదిలో నిలిచిపోయేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారీ ఊరేగింపు నడుమ బాలరాముడు అయోధ్య ఆలయ పరిసర ప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఏర్పాట్లు పూర్తిచేసింది. రేపు విగ్రహం గర్భగుడిలోకి ప్రవేశపెట్టనున్నారు. నేడు ప్రజల ముందు ఆవిష‌్కరించే బాలరాముడి విగ్రహం ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రూపొందించారు. పసితనం, అమాయకత్వం.. దైవత్వం ఉట్టిపడేలా బాలరాముడి విగ్రహాన్ని తీర్చి దిద్దారు.

Tags:    

Similar News