LK Advani to depose in Babri mosque demolition case: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : అద్వానీ వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ
LK Advani to depose in Babri mosque demolition case: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వాంగ్మూలం నమోదు చేయాలనీ సిబిఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది
LK Advani to depose in Babri mosque demolition case: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వాంగ్మూలం నమోదు చేయాలనీ సిబిఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. దీంతో సోమవారం జూలై 24 ను ఆయన వాంగ్మూలం తీసుకోనుంది. సిఆర్‌పిసి సెక్షన్ 313 కింద 92 ఏళ్ల బిజెపి నాయకుడి వాంగ్మూలం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సిబిఐ అధికారులు రికార్డ్ చేయనున్నారు. అద్వానీ తోపాటు బిజెపి సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి వాంగ్మూలాన్ని కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జూలై 23న నమోదు చెయ్యాలని స్పెషల్ జడ్జ్ జస్టిస్ ఎస్‌కే యాదవ్ సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 313 కింద అద్వానీ, జోషిల వాంగ్మూలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు చేయనున్నట్టు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 31 లోగా విచారణ పూర్తిచేయడానికి రోజువారీ విచారణలు నిర్వహిస్తున్న కోర్టు, శివసేన మాజీ ఎంపి సతీష్ ప్రధాన్
వీడియో లింక్ ద్వారా జూలై 22 న హాజరు కావాలని నిర్ణయించింది. సోమవారం, వ్యక్తిగతంగా హాజరైన నిందితుడు సుధీర్ కక్కాడ్ యొక్క వాంగ్మూలాన్ని సిబిఐ రికార్డ్ చేసింది. ఇతర నిందితుల మాదిరిగానే, కక్కాడ్ కూడా తాను నిర్దోషి అని, రాజకీయ కారణాల వల్ల అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తప్పుగా ఇరికించిందని.. తనను ఈ కేసు నుంచి తొలగించాలని కోరారు. ఇక మరో నిందితుడు రామ్ చంద్ర ఖత్రి వాంగ్మూలాన్ని కోర్టు మంగళవారం నమోదు చేయనుంది. బిజెపి నాయకురాలు ఉమా భారతి ఈ నెల మొదట్లో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. వీరంతా కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.