Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభం
Ayushman Bharat: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ డిజిటిల్ మిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి భారతీయుడికి డిజిటల్ హెల్త్ ఐడీని ఇవ్వనున్నట్లు తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య చికిత్సను అందించడంలో ఎదురయ్యే సమస్యను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. డిజిటలైజేషన్ వల్ల ఆరోగ్య నియంత్రణ మరింత సులభం అవుతుందని ప్రధాని మోడీ తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా.. ఆయుష్మాన్ భారత్ రోగుల సేవల గురించి దేవవ్యాప్తంగా అన్ని హాస్పిలళ్లకు విస్తరించిందన్నారు. సాంకేతికంగా బలమైన ఫ్లాట్‌ఫామ్‌తో సులభమైన వైద్య చికిత్స వీలవుతుందన్నారు.