Ayodhya Ram Temple Construction Date Fixed: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ తేదీ ఖరారు

Ayodhya Ram Temple Construction Date Fixed: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ తేదిని రామజన్మభూమి ట్రస్ట్ ఖరారు చేసింది. ఆగస్టు 5న భూమిపూజ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

Update: 2020-07-19 09:49 GMT
Ayodhya Ram Temple Construction Date Fixed

Ayodhya Ram Temple Construction Date Fixed: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ తేదిని రామజన్మభూమి ట్రస్ట్ ఖరారు చేసింది. ఆగస్టు 5న భూమిపూజ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖలు పాల్గొంటారని ట్రస్టు సభ్యులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మించడానికి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఆదివారం ఈ ట్రస్ట్ సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అలాగే రామాలయం నిర్మాణానికి భూమిపూజ తేదిని ఖరారు చేశారు. త్వరితగతిన రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేయాలనీ ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు నిర్ణయించారు.

రామాలయం నిర్మాణం సందర్బంగా వర్షాకాలం అనంతరం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి రామాలయం నిర్మాణానికి 10 కోట్ల కుటుంబాలను సంప్రదిస్తామని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. అమరోవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గాక దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించాలని ట్రస్ట్ సభ్యులు నిర్ణయించారు. ఈ విషయాన్నీ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఇక రామాలయం నిర్మాణానికి జరిగే భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ కూడా పాల్గొంటారని ట్రస్టు ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News