Ayodhya Ram Mandir Bhumi Pujan: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పూర్తయిన భూమి పూజ
Ayodhya Ram Mandir Bhumi Pujan: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తొలిఅడుగు పడింది.
కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నం నెరవేరడానికి తోలి అడుగు పడింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పరిమిత సంఖ్యలో హాజరయిన అతిధుల మధ్యలో పండితులు ప్రధాని మోడ్ తో మధ్యాహ్నం సరిగ్గా 12:44 గంటల సమయంలో రామ మందిర నిర్మాణానికి శంకు స్థాపన చేయించారు.
ఈ ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధాని తొలుత రాం ల్లా మందిరంలో పూజలు చేశారు. అక్కడ పారిజాత మొక్కను అయన నాటారు. అనంతరం అయన హనుమాన్ గదీలోని హనుమాన్ ఆలయంలోకి వెళ్లి పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆయనకు వెండి కిరీటాన్ని బహూకరించారు. అటు తరువాత అయన రామ మందిర భూమి పూజా కార్యక్రమ వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ పండితులు ఆయనతో సంకల్ప పూజ నిర్వహింప చేశారు. రామ శిలాన్యాస భాగంగా యావద్భారతావని నుంచి భక్తులు తీసుకువచ్చిన శ్రీరామ నామ లిఖిత ఇటుకలు ఉంచిన ప్రాంతంలో ప్రధాని మోడీ భూమి పూజా కార్యక్రమం కోసం ప్రత్యకంగా తయారు చేయించిన వెండి ఇటుకతో శంకుస్తాపన కార్యక్రమం నిర్వహించారు.
ప్రధానితో పాటుగా ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ నిరిత్య గోపాల్ దాస్ మహారాజ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ లకు మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మొత్తం ఈ కార్యక్రమానికి గాను 175 మంది అతిధులకు ఆహ్వానాన్ని అందించారు. ఇక యూపీ నుంచి సీఎం యోగి అధిత్యనాథ్ , డిప్యూటీ సీఎంలకి మాత్రమే ఆహావానాన్ని అందించింది. వీరు మినహా ఇతర మంత్రులకు ఆహ్వానం లేదు.