Ayodhya Ram Mandir Bhumi Pujan: అప్పుడే మళ్ళీ వస్తా.. 28 ఏళ్ల క్రితం చేసిన సంకల్పం సాకారం చేసుకున్న ప్రధాని మోడీ!
Ayodhya Ram Mandir Bhumi Pujan: 28 ఏళ్ల తరువాత అయోధ్యలో అడుగిడుతున్న ప్రధాని మోడీ!
ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో కాలు పెట్టి 28 ఏళ్ళు అయింది. అప్పట్లో త్రిరంగా యాత్ర కోసం అయోధ్య వచ్చిన మోడీ.. మళ్ళీ ఇప్పుడు ప్రధాని హోదాలో రామ మందిరం నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికి అక్కడ అడుగుపెడుతున్నారు.
తిరంగా యాత్రలో భాగంగా 1992 జనవరి 18న అయోధ్యకు వెళ్లారు. సరిగ్గా 28 ఏళ్ల కిందట మోడీ అయోధ్య వచ్చారు. అక్కడ రామ్ లల్లాను దర్శించుకున్నారు.
అప్పుడు అయన '' మళ్ళీ అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగే సమయంలోనే వస్తాను'' అని ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన సంకల్పం నెరవేర్చుకునే.. రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టడానికే అయోధ్యలో కాలుపెట్టడం విశేషం.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయాలంటూ కన్యాకుమారి నుంచి నరేంద్ర మోదీ 'తిరంగాయాత్ర'ను ప్రారంభించారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల మీదుగా యాత్రను కొనసాగించిన మోడీ.. జనవరి 18న ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. ఫైజాబాద్ సమీపంలోని ఓ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషి హాజరయ్యారు. ఆ మర్నాడు జోషితో కలిసి అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకున్న మోదీ మీడియాతో మాట్లాడుతూ శ్రీరాముడి ఆలయం నిర్మించే సమయంలో మరోసారి అయోధ్య వస్తానని చెప్పారు. ఇప్పుడు అదే మాట నిజం అయింది.