Ayodhya Pooja 2020 : భూమిపూజ కార్యక్రమానికి విస్త్రతమైన ఏర్పాట్లు!
Ayodhya Pooja 2020 : అయోధ్యలో రేపటి (ఆగస్టు 05) న భూమిపూజ కార్యక్రమానికి విస్త్రతమైన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. దీనిని ఎంతో
Ayodhya Pooja 2020 : అయోధ్యలో రేపటి (ఆగస్టు 05) న భూమిపూజ కార్యక్రమానికి విస్త్రతమైన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ ప్రభుత్వం నిఘావర్గాల హెచ్చరికల నేపధ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తుంది. ఈ భూమిపూజ జరిగే వేదికపై ప్రధానితో పాటుగా మరో నలుగురికి మాత్రమే చోటుని కల్పిస్తున్నారు. అందులో ప్రధానితో పాటుగా ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ నిరిత్య గోపాల్ దాస్ మహారాజ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ లకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఇక మొత్తం ఈ కార్యక్రమానికి గాను 175 మంది అతిధులకు ఆహ్వానాన్ని అందించారు. ఇక యూపీ నుంచి సీఎం యోగి అధిత్యనాథ్ , డిప్యూటీ సీఎంలకి మాత్రమే ఆహావానాన్ని అందించింది. ఇక మినహా ఇతర మంత్రులకు ఆహ్వానం లేదు.
జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం :
రేపు ఉదయం 10.35 నిమిషాలకు లక్నో విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోడి. అక్కడి నుండి ఎయిర్ ఫోర్స్ విమానంలో అయోధ్యకు పయనం అవుతారు. అక్కడ నుంచి 11.44 నిమిషాలకు సాకేత్ యూనివర్సిటీ లో ప్రధాని హెలీకాప్టర్ ల్యాండింగ్ అవుతుంది. అక్కడి నుండి నేరుగా హనుమాన్ ఘాటికి చేరుకోనున్న ప్రధాని, అక్కడ పది నిమిషాల పూజ అనంతరం నేరుగా భూమిపూజ జరిగే రామజన్మభూమి ప్రాంగణానికి ప్రధాని మోడి హాజరవుతారు. ఇక భూమిపూజ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం కొనసాగనుంది. అనంతరం మోడీ తిరిగి 2.10 నిమిషాలకు ఢిల్లీ బయలుదేరనున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు అందిన వారికి మాత్రమే భూమిపూజ కార్యక్రమ ప్రాంగణంలోకి ప్రవేశం ఉంటుంది. ఆహ్వానం కలిగిన వారంతా ఉదయం 10.30 గంటలకల్లా అతిధులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ప్రతి ఆహ్వాన పత్రికకు సెక్యూరిటీ కోడ్. కెమెరాలు , ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అతిధులు తీసుకురావడానికి అనుమతి లేదు. భూమిపూజ కార్యక్రమానికి దేశంలోని 2 వేల ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి, 100 నదుల నుండి నీరు వినియోగం ఉపయోగిస్తున్నారు.