Manipur: మణిపూర్‌లో బీజేపీ కార్యకర్తల బీభత్సం
Manipur: పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగిన కమలనాథులు
Manipur: మణిపూర్‌లో బీజేపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగారు. అధిష్ఠానం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం బీరెన్‌సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది. తాజాగా బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అందులో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన నేతలకు అధికంగా టికెట్లను కేటాయించారు. పార్టీలో పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్త నేతల అనుచరులు రాజధాని ఇంపాల్‌తో పాటు పలు ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాలను ముట్టడించారు.
ప్రధాని మోదీ, సీఎం బీరెన్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీజేపీ జెండాలను తగులబెట్టారు. ప్రధాని, సీఎంలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతల చిత్రాలను చెప్పులతో కొట్టారు. నిరసనలు హోరెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టారు.