దిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణ స్వీకారం

Update: 2024-09-21 11:13 GMT

దిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణ స్వీకారం

దిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ మార్లెనా శనివారం రాజ్ నివాస్ లో ప్రమాణం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు.అంతకుముందు జరిగిన ఆప్ శాసనసభ పక్ష సమావేశంలో అతిశీని శాసనసభపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  సౌరబ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాష్ గెహ్లాట్, ముఖేష్ అహ్లావట్ లను అతిశీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అతిశీ ప్రమాణం చేసిన తర్వాత మిగిలిన ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. 

దిల్లీకి మూడో మహిళా సీఎంగా అతిశి

షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ లు గతంలో దిల్లీకి ముఖ్యమంత్రులుగా కొనసాగారు. తాజాగా అతిశీ సీఎంగా ప్రమాణం చేయడంతో మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె రికార్డులకెక్కారు. సుష్మా స్వరాజ్ 1998 అక్టోబర్ నుంచి 1998 డిసెంబర్ వరకు ఈ పదవిలో కొనసాగారు.

46 ఏళ్ల వయస్సులో ఆమె సీఎం పదవిని చేపట్టారు. దిల్లీకి ఎక్కువ కాలం సీఎంగా కొనసాగిన వారిలో షీలా దీక్షిత్ ఒకరు. 1998 నుంచి 2013 వరకు 15 ఏళ్ల పాటు ఆమె దిల్లీ సీఎంగా ఉన్నారు. 60 ఏళ్ల వయస్సులో ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె నాయకత్వంలో దిల్లీలో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు సాధించింది.

పట్టణ అభివృద్ది, రవాణా నెట్ వర్క్, విస్తరణ, విద్య,ఆరోగ్యంలో ఆమె ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టారు. దిల్లీ సీఎంగా 43 ఏళ్ల అతిశీ ప్రమాణం చేశారు. అతి చిన్న వయస్సులోనే ఆమె సీఎం పదవిని చేపట్టారు. గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆమె ఆర్ధిక, నీరు, విద్య వంటి శాఖలను నిర్వహించారు.

Tags:    

Similar News