Assembly Elections 2021: ప్రశాంతంగా ముగిసిన ఐదు రాష్ట్రాల పోలింగ్‌

Assembly Elections 2021: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

Update: 2021-04-06 15:30 GMT

Assembly Elections 2021: ప్రశాంతంగా ముగిసిన ఐదు రాష్ట్రాల పోలింగ్‌

Assembly Elections 2021: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఐదింటిలో నాలుగు రాష్ట్రాల పోలింగ్‌ ఈరోజుతో ముగిసింది. బెంగాల్‌ ఎన్నికలు మాత్రం మరో ఐదు దశలున్నాయి. పోలింగ్‌ సందర్భంగా ఎక్కడా పెద్దగా హింసాత్మక సంఘటనలు జరగలేదు. మొత్తం మీద ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. పుదుచ్చేరి, తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో ఇవ్వాళ ఒక్కరోజులోనే పోలింగ్‌ ముగిసింది. అసోంలో మూడోదశ పోలింగ్‌తో మొత్తం పోలింగ్ కంప్లీట్‌ అయింది.

ఇక బెంగాల్‌లో మాత్రం మూడు దశలు ముగిసినా ఇంకా ఐదు దశలున్నాయి. ఈ నెల 27న చివరిదశ పోలింగ్‌ జరుగుతుంది. మే 2న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. సాయంత్రం 5 గంటల సమయానికి తమిళనాడులో 65 శాతం ఓటింగ్‌ జరిగింది. కేరళలో 70 శాతం, అసోంలో 81 శాతం పోలింగ్ జరిగింది. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు, ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు అంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో శశికళ ఓటు గల్లంతు కావడంతో ఆమె ఓటు వేయలేకపోయారు.

Tags:    

Similar News