Assam MLA rescue People and livestock: శభాష్‌ ఎమ్మెల్యే, నీటిలోకి దిగి మరీ...

Assam MLA Rescue people and livestock: ఓటర్ల చేత ఓట్లు వేయించుకొని.. గెలిచిన అనంతరం పత్తా లేకుండా పోయే ఎమ్మెల్యేలున్న ఈరోజుల్లో.. ఓ ఎమ్మెల్యే తన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేర్చి శబాష్ అనిపించుకున్నారు

Update: 2020-07-15 08:44 GMT
Assam MLA goes water rescue people and livestock

Assam MLA rescue People and livestock: ఓటర్ల చేత ఓట్లు వేయించుకొని.. గెలిచిన అనంతరం పత్తా లేకుండా పోయే ఎమ్మెల్యేలున్న ఈరోజుల్లో.. ఓ ఎమ్మెల్యే తన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేర్చి శబాష్ అనిపించుకున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు అండగా తనే నిలిచారు. తన నియోజక వర్గంలో వరదలో చిక్కుకున్న ప్రజలను, పశువులను స్వయంగా నీటిలోకి దిగి మరీ కాపాడారు. కొద్దిరోజులుగా అసోంలో విపరీతమైన వరదలు వస్తున్నాయి. దాంతో లొత్తట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మృణాల్‌ సైకియా కూడా వరదలో చిక్కుకున్న మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలను కాపాడే సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

గోలఘాట్ జిల్లాలోని గోర్మోరా గ్రామంలో పశువులు వరదల్లో చిక్కుకున్నాయి. వాటిని స్వయంగా ఎమ్మెల్యే రక్షించారు. అంతేకాదు చిన్నపిల్లలు, వృద్ధులను తనపై ఎక్కించుకొని మరి కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు ఆ ఎమ్మెల్యే చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు. ప్రజలకు ఇలాంటి ప్రజాప్రతినిధులు అవసరమని అంటున్నారు. మరోవైపు వరద పరిస్థితిపై ఎమ్మెల్యే కూడా ట్వీట్ చేశారు. తన నియోజకవర్గంలో వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయని.. మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలను కాపాడుతున్నామని పేర్కొన్నారు. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News