Assam: మాస్కులెందుకు అంటోన్న బీజేపీ ఎమ్మెల్యే

Assam: బీజేపీ నేత హిమంత్ బిశ్వా మాత్రం మాస్కులు పెట్టుకునే అవ‌స‌రం లేదంటున్నారు.

Update: 2021-04-04 08:35 GMT

Assam:(Photo Wikipedia)

Assam: ప్రపంచమంతా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యలో వైద్యలు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. కరోనాను అరికట్టడంలో మాస్క్ లు ప్రధాన పాత్ర వహిస్తాయని అందరూ చెప్తున్న విషయం. ప‌లు ప్రాంతాల్లో మాస్కులు ధ‌రించ‌క‌పోతే ఫైన్లు కూడా వేస్తున్నారు. కానీ మీరు మాస్కలెందుకు ధరిస్తున్నారు. కరోనా అని అనుమానం వస్తేనే ధరించాలని చెప్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే హిమంత్ బిశ్వా. ఈయన అసోం ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు.

ప్ర‌జ‌లు మాస్కులు పెట్టుకుని భయాలను పెంచుతున్నారని ఆయ‌న ఓ ఇంటర్వ్యూలో అన్నారు. త‌మ రాష్ట్రంలో ఇప్పుడు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ప్రజలు మాస్క్ లు ఎప్పుడు పెట్టుకోవాలో తాము తెలియజేస్తామని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాము ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించాల్సి ఉంద‌ని తెలిపారు. మాస్కులు పెట్టుకుంటే బ్యూటీ పార్లర్‌కు ఎలా వెళ్లగలమని ఆయ‌న ప్రశ్నించడం గ‌మ‌నార్హం. ఒక‌వేళ‌ ఎవరికైనా కరోనా సోకింద‌ని అనుమానం వ‌స్తే అప్పుడే వారు మాస్కు పెట్టుకోవాలని ఆయ‌న సూచించారు. మంత్రి స్థానంలో వుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేత వ్యాఖ్యల పై వైద్యులు, ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.

Tags:    

Similar News