Bullet Train: బుల్లెట్ రైలు ట్రాక్, స్పీడ్ గురించిన అప్‌డేట్‌లను షేర్ చేసిన అశ్విని వైష్ణవ్
Bullet Train: పట్టాల వీడియో రిలీజ్ చేసిన మంత్రి అశ్వినీ వైష్ణవ్
Bullet Train: త్వరలో ఇండియాలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య రైలు నడిపించనున్నారు. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్‌ను రైల్వే శాఖ నిర్మిస్తోంది. తొలిసారిగా ట్రాక్‌కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు. దేశంలోనే తొలి బ్యాలస్ట్‌లెస్ ట్రాక్ విశేషాలను వివరించారు. బుల్లెట్ రైలు దృశ్యాలను యానిమేషన్ రూపంలో పొందుపరిచారు. హైస్పీడ్ రైళ్ల బరువును భరించేందుకు ప్రత్యేకంగా ట్రాక్ నిర్మించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ట్రాక్‌లో వేగం గంటకు 320 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పారు.