Ashish Mishra: లఖింపూర్ కేసులో విచారణకు హాజరైన ఆశిష్ మిశ్రా
Ashish Mishra: ఇవాళ హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు...
Ashish Mishra: లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాను క్రైమ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు.. అంతేకాదు.. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో విచారణకు హాజరు కావాలని ఆశిష్‌కు నోటీసులు జారీ చేశారు.. నిన్న హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
అయితే.. ఆరోగ్యం బాగాలేదనే కారణంతో హాజరు కాలేదు.. ఇవాళ హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిన నేపథ్యంలో.. ఇవాళ ఉదయం క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరయ్యారు.. ప్రస్తుతం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ రోజు ఏం జరిగిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కారులో బుల్లెట్ కూడా దొరకడంతో ఆకోణంలో కూడా విచారించే ఛాన్స్ ఉంది.
ఈనెల 3న లఖీంపూర్ లో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక జర్నలిస్టుతో పాటు 9 మంది మృతి చెందారు. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.. మరోవైపు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వానికి కోరింది. అయితే.. యూపీ సర్కార్ ఇచ్చిన నివేదికపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. ఘటనపై నిజా నిజాలు తేల్చేందుకు యూపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.