Swami Agnivesh Passes Away: స్వామి అగ్నివేశ్ కన్నుమూత
Swami Agnivesh Passes Away: సామాజిక కార్యకర్త, ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ (80) మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు
Swami Agnivesh Passes Away: సామాజిక కార్యకర్త, ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ (80) మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కాలేయ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) కు తరలించారు. కీలక అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అగ్నివేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం మరణించారని వైద్యులు తెలిపారు. ఈ మరణ విషయాన్నిప్రశాంత్ భూషణ్ తన ట్వీట్ ద్వారా తెలియచేశారు,
స్వామి అగ్నివేశ్ గతంలో ఆర్యసభ పేరిట రాజకీయ పార్టీని స్ధాపించి హరియాణా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన ఆర్యసభ పార్టీని నడిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. భిన్న మతాల మధ్య పలు అంశాలపై ఆయన వారధిగా పనిచేశారు. అగ్నివేశ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
The demise of Swami Agnivesh is a huge tragedy. A true warrior for humanity&tolerance. Among the bravest that I knew,willing to take huge risks for public good.Was brutalised in Jharkhand by a BJP/RSS lynch mob 2 yrs ago. Liver got damaged. RIP Agnivesh jihttps://t.co/SapzPnRznC
— Prashant Bhushan (@pbhushan1) September 11, 2020