Arvind Kejriwal: బీజేపీ సూచనలనే సీబీఐ పాటిస్తోంది
Arvind Kejriwal: నన్ను జైల్లో పెడతామని పదేపదే బెదిరిస్తున్నారు
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాసేపట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరకానున్నారు. సీబీఐ అధికారులు ఇప్పటికే... కేజ్రీవాల్ కు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. మద్యం పాలసీపై అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పుతో పెద్ద ఎత్తున ముడుపులు మారాయన్న ఆరోపణలతో ఇప్పటికే అనేక మందిని సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్రపై సీబీఐ ఆరా తీయనుంది. విచారణ నేపథ్యంలో సీబీఐ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
విచారణకు ముందు వీడియో రిలీజ్ చేసిన సీఎం కేజ్రీవాల్... బీజేపీ అధికార అహంకారంతో వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ సూచనలనే సీబీఐ పాటిస్తోందని ఆరోపించారు. మాట వినకుంటే జైల్లో పెడతాం అనేలా వ్యవహరిస్తున్నారన్న కేజ్రీవాల్.. తనను అరెస్ట్ చేస్తారంటూ బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు. 8 ఏళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపెట్టానని.. 30 ఏళ్లలో గుజరాత్ ఏం అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు. దేశాన్ని ప్రేమిస్తా.. దేశం కోసం ప్రాణమిస్తామని వ్యాఖ్యానించారు.