కీలక పదవి కోసం పోటిలో అరుణ్ జైట్లీ కుమారుడు!
Rohan Jaitley DDCA Chief : కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీకి ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్ పదవి దక్కినట్టుగా తెలుస్తోంది.
Rohan Jaitley DDCA Chief : కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీకి ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్ పదవి దక్కినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అయన నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశారు. సభ్యులంతా ఆయనకే మద్దతుగా ఉండడంతో ఎన్నికల లాంఛనం కానున్నట్లుగా తెలుస్తోంది. రోహాన్ ఎన్నికకు తామంతా సహకరిస్తామని డీసీఏ సభ్యులు తెలిపారు. రోహాన్ జైట్లీ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంతో పలువురు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే ఇండియన్ టీం ఓపెనర్ బ్యాట్స్‌మెన్ శిఖర్ దావన్ ట్విటర్ వేదికగా విషెష్ తెలిపాడు. రోహాన్ జైట్లీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టుగా ధావన్ వెల్లడించాడు.
కేంద్రమంత్రి కంటే ముందు అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ కి ఎన్నో సేవలను అందించారు. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. అయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే సెహ్వాగ్, గంభీర్ లాంటి ఆటగాళ్ళు వెలుగులోకి వచ్చారు. అయన సేవలకి గుర్తుగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అయన పేరును పెట్టారు. మోదీ తొలి దఫా పాలనలో కేంద్ర ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రక్షణమంత్రిగా కూడా జైట్లీ సేవలందించిన విషయం తెలిసిందే. అయితే అయన వారసత్వంలో కొనసాగేందుకు స్థానిక పెద్దల సహకారంతో రోహాన్ డీడీసీఏ పదవికి నామినేషన్ వేశారు. అయితే రోహన్ జైట్లీకి సభ్యల మద్దతు ఉండడంతో అయన గెలుపు ఖాయమే అని తెలుస్తోంది.