Ayodhya: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు శరవేగంగా ఏర్పాట్లు

Ayodhya: ఇదే అధికారిక విగ్రహం అని ఇప్పటివరకు వెల్లడించని ట్రస్ట్

Update: 2024-01-20 05:16 GMT

Ayodhya: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు శరవేగంగా ఏర్పాట్లు

Ayodhya: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణ శిలతో తయారైన బాలరాముడి దివ్యరూపం అబ్బురపరుస్తోంది. విగ్రహం ఎత్తు 51 అంగుళాలు, బరువు 250 కిలోలు ఉంటుంది. గర్భాలయానికి ఈ విగ్రహం చేరుకోగా.. ఈ నెల 22న అయోధ్య ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. అయితే.. ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేక పూజల తర్వాత కళ్లకు వస్త్రంతో ఉన్న రామ్‌లల్లా విగ్రహం ఫొటోను విడుదల చేసింది.

అయోధ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా.. బాలరాముడిని గర్భగుడికి తీసుకువచ్చారు. ఐదేళ్ల బాలుడి రూపంలో దర్శనమివ్వనున్న శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలోని ప్రధాన వేదికపై ప్రతిష్టించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య ప్రధాన వేదికపై ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే.. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిధ పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక క్రతువులు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో గణేశ్ పూజ, వరుణ పూజ, వాస్తు పూజ శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.. జలదివస్ లో భాగంగా రామ్ లల్లా విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు.

Tags:    

Similar News