Arnab Goswami's Arrest: అర్నబ్ అరెస్ట్ వ్యవహారంపై పేలుతోన్న మాటల తూటాలు
Arnab Goswami's Case Updates : ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి అరెస్ట్.. మహారాష్ట్ర రాజకీయాల్లో రగడ సృష్టించింది. ఇది కక్షసాధింపేనని బీజేపీ నేతలు ఫైర్ అవుతుంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందని శివసేన నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ఎమర్జన్సీ రోజులను తలపిస్తున్నాయన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై శివసేన తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా చేసిన అర్నాబ్‌ను అరెస్ట్ చేస్తే బ్లాక్ డే, మీడియా స్వేచ్ఛపై దాడి అంటూ బీజేపీ గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేసింది.
ఆర్నాబ్‌ను అరెస్ట్ చేస్తే కేంద్రమంత్రులు రాష్ట్ర నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మీరేం చేశారంటూ అంటూ శివసేన అధికార పత్రిక సామ్నా విమర్శించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్‌లో ఒక జర్నలిస్టును అరెస్ట్ చేశారని ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టులను చంపేశారంటూ రాసుకొచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఈ ఉదంతాలు ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాయని బీజేపీ నేతలు ఎవరూ అనలేదని సెటైర్లు వేసింది. అర్నాబ్ వల్ల ఒక అమాయక వ్యక్తి అతని తల్లి ఆత్మహత్య చేసుకున్నారని తమకు న్యాయం చేయాలని మృతుడి భార్య డిమాండ్ చేస్తోందని సామ్నాలో రాశారు.