Nagaland: నాగాలాండ్ ఘటనపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆర్మీ ఆదేశాలు జారీ

Nagaland: నాగాలాండ్ ఘటనపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది.

Update: 2021-12-05 07:57 GMT

నాగాలాండ్ ఘటనపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆర్మీ ఆదేశాలు జారీ (ఫైల్ ఇమేజ్)

Nagaland: నాగాలాండ్ ఘటనపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. పౌరుల మృతిపై నాగాలాండ్ సీఎం నెయ్‌ప్యూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిట్‌తో దర్యాప్తు చేయిస్తామన్నారు. ఇక ఘటనపై కేంద్ర కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అనుకోకుండా జరిగిన ఘటన అని మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు.

నాగాలాండ్‌లో భద్రతా దళాలు పొరపాటు పడ్డాయి. మిలిటెంట్లుగా భావించి జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు మృతి చెందారు. నిన్న సాయంత్రం మోన్ జిల్లా ఓటింగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన వారందరూ బొగ్గు గని కార్మికులుగా గుర్తించారు. మిలిటెంట్ల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. అదే సమయంలో పనులు ముగించుకుని వస్తున్న వస్తున్న కార్మికులను మిలిటెంట్లుగా పొరబడిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.

Tags:    

Similar News