Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై వాదనలు
Arvind Kejriwal: లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన అన్ని ఫైల్స్ కోరిన సుప్రీం
Arvind Kejriwal: లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడీవేడీగా వాదనలు జరిగాయి. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను సుప్రీంకోర్టు కోరింది. మనీష్ సిసోడియా అరెస్టుకు ముందుకు ఫైల్స్‌ను కూడా సమర్పించాలని ఈడీని ఆదేశించింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది ఈడీ. నాయకులను ప్రత్యేకంగా చూడడం సరికాదని తెలిపింది. కేజ్రీవాల్‌కు బెయిల్ అక్కర్లేదు, సీఎంకు ఫోర్ట్ ఫోలియో కూడా లేదని ధర్మాసనం ముందు వాదించింది. అయితే ఎన్నికల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇస్తామంటూ సంకేతాలు ఇచ్చింది ధర్మాసనం. భోజన విరామం తర్వాత వాదనలు కొనసాగుతాయని తెలిపింది ధర్మాసనం.