Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ కార్డుకి అప్లై చేశారా.. 5 లక్షల వరకు ఉచిత చికిత్స..!

Ayushman Bharat: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది.

Update: 2022-09-19 11:30 GMT

Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ కార్డుకి అప్లై చేశారా.. 5 లక్షల వరకు ఉచిత చికిత్స..!

Ayushman Bharat: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో ఆయుష్మాన్ భారత్ యోజన కూడా ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలోని పేద కుటుంబాలకు ఉచిత వైద్య చికిత్స సౌకర్యాలను అందిస్తుంది. దేశంలోని ఆరోగ్య సదుపాయాలు లేని పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ యోజన ప్రారంభించింది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.

ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలు

ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ప్రధాన ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. చికిత్స పొందుతున్న వ్యక్తి ఎటువంటి ఖర్చును చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మీరు కచ్చితంగా ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరి కార్డుని పొందాలి. అప్పుడే ఈ ప్రయోజనం పొందగలరు.

ఆయుష్మాన్ కార్డు ఎలా పొందాలి..?

1. ముందుగా మీరు సమీపంలోని ప్రజా సేవా కేంద్రానికి వెళ్లాలి.

2. జాబితాలో మీ పేరును అధికారులు తనిఖీ చేస్తారు.

3. ఆయుష్మాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో మీ పేరు నమోదు అయి ఉంటే మాత్రమే కార్డు పొందుతారు.

4. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రేషన్ కార్డ్, ఫొటో కాపీ, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో వంటి అన్ని పత్రాలని అధికారికి సమర్పించాలి.

5. తర్వాత మీ రిజిస్ట్రేషన్ పౌర సేవా కేంద్రం అధికారి ద్వారా చేయబడుతుంది.

6. తర్వాత అధికారులు మీకు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను అందిస్తారు.

7. ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్ రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో మీకు చేరుతుంది.

రిజిస్టర్డ్ ఆసుపత్రులకు వెళ్లడం ద్వారా మీరు హెల్త్ కార్డ్‌ను పొందవచ్చు. దీని కోసం మీరు ముందుగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ ఫోటో కాపీ, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో వంటి మీకు అవసరమైన అన్ని పత్రాలను తీసుకోవాలి. ఇప్పుడు ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్య జాబితాలో మీ పేరును తనిఖీ చేస్తారు. జాబితాలో మీ పేరు ఉంటే మీకు ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్ ఇస్తారు.

Tags:    

Similar News