కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి అనిల్‌ యాదవ్

ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. అలాగే 2021 డిసెంబర్ కల్లా ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని..

Update: 2020-09-21 11:05 GMT

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రా సింగ్ షెకావత్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో కేంద్రమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్రానికి జలవనరుల రూపంలో రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలనీ మంత్రి అనిల్ కోరారు. ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. అలాగే 2021 డిసెంబర్ కల్లా ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని..

అందుకు తగ్గట్టే పోలవరం పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన విడుదల చేయాలనీ కోరినట్టు మంత్రి అనిల్‌ వెల్లడించారు.. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు అనిల్. 2014 కు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 4 వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు త్వరితగతిన విడుదల చేస్తామని మంత్రి గజేంద్ర సింగ్‌ హామీ ఇచ్చారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని కూడా చెప్పినట్టు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.   

Tags:    

Similar News