Manchiryala: గోదావరి నదిపై అంతర్గాం వంతెనకు మోక్షం కలిగేనా?

Manchiryala: మంచిర్యాల నుంచి గోదావరిఖని వెళ్లాలంటే శ్రీరాం పూర్ నుంచి ఇందారం మీదుగా పెద్దపల్లి జిల్లా వెళ్లాల్సి ఉంటుంది

Update: 2021-04-01 07:43 GMT

Manchiryala:(ఫైల్ ఇమేజ్)

Manchiryala: మంచిర్యాల, అంతర్గాం మీదుగా గోదావరి నదిపై వంతెన నిర్మిస్తామని సీఎం కేసీఆర్ రెండున్నర ఏళ్ల క్రితం హామీ ఇచ్చారు. బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రభుత్వం 125 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇందుకోసం జీవో కూడా జారీ చేసింది. రెండున్నర ఏళ్లు గడుస్తున్నా వంతెన నిర్మాణానికి టెండర్ పిలవకపోవడం స్థానికులను విస్మయం కలిగిస్తోంది.

మంచిర్యాల నుంచి గోదావరి ఖని వెళ్లాలంటే...

మంచిర్యాల నుంచి గోదావరి ఖని వెళ్లాలంటే శ్రీరాం పూర్ నుంచి ఇందారం మీదుగా పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్లాల్సి ఉంటుంది. మంచిర్యాల, అంతర్గాం మీదుగా గోదావరి నదిపై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మిస్తే 11 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నవంబర్ 29న శ్రీరాంపూర్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు విజ్నప్తి మేరకు మంచిర్యాల, అంతర్గాం మీదుగా గోదావరి నదిపై వంతెన నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మంచిర్యాల, అంతర్గాం వంతెన నిర్మాణానికి ప్రభుత్వం 125 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇందుకోసం 170 పేరిట జీవో జారీ అయింది. రెండున్నర ఏళ్లు గడుస్తున్నా బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులు టెండర్ పిలువకపోవడం స్థానికులను ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రతిపక్షాలు ఆగ్రహం...

మంచిర్యాల, అంతర్గాం వంతెన పనులు ప్రారంభంకాకపోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ల కోసం సీఎం కేసీఆర్ బ్రిడ్జ్ పేరిట మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ప్రజలను మోసం చేశారని విమర్శిస్తున్నాయి. వెంటనే బ్రిడ్జ్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాయి. మంచిర్యాల, అంతర్గాం వంతెన నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని స్థానిక నాయకులు సీఎం కేసీఆర్ కు లేఖలు కూడా రాశారు.

Tags:    

Similar News