AP Rains: ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం, దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది డిసెంబర్ 12వ తేదీ నాటికి శ్రీలంక తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది.
డిసెంబర్ 12న తమిళనాడుతోపాటు రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దానిపై స్పష్టత వస్తుందన్నారు.
నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూపోతుటాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు తెలంగాణలో అక్కడక్కడా జల్లుల్లు, ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
ఏపీలో గంటలకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతలో గాలి వేగం 30 కిలోమీటర్లు ఉంటుంది. అందుకే చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది.