Corbevax: సెప్టెంబర్‌లో అందుబాటులోకి కోవిడ్ వ్యాక్సిన్ 'కోర్బెవాక్స్'
* ప్రస్తుతం భారత్‌లో 4 వ్యాక్సిన్లు
Corbevax Vaccine: దేశీ ఫార్మా సంస్థ బయోలజికల్-ఇ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ 'కోర్బెవాక్స్' త్వరలోనే అందుబాటులోకి రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ ముగింపు నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్‌బీడీ ప్రోటీన్ సబ్-యూనిట్ ప్లాట్‌ఫామ్ అనే కాన్సెప్టుతో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం మూడో దశ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతుండగా వచ్చే నెలాఖరు నాటికి అత్యవసర వినియోగం కోసం బయాలజికల్-ఇ సంస్థ కేంద్రానికి దరఖాస్తు చేసుకోనుంది. భారత్‌లో ప్రస్తుతం నాలుగు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్ వి, మోడెర్నా వ్యాక్సిన్లు ఉన్నాయి. కేంద్రం వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి వీటి ద్వారా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరుగుతోంది.