బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం..!
* రానున్న ఒకటి, రెండు రోజుల్లో పుదుచ్చేరి వైపుగా పయనం
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర శ్రీలంక, తమిళనాడు తీరం వెంబడి అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న ఒకటి, రెండు రోజుల్లో పుదుచ్చేరి వైపుగా పయనిస్తుందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అలాగే.. తెలంగాణలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు వాతావరణశాఖ అధికారులు.