ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

* తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం * మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ * డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం * రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచన

Update: 2020-11-30 06:01 GMT

వరుస తుపానులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నివర్‌ తుపానును మరువకముందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే ఛాన్స్‌ ఉన్నట్టు స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Tags:    

Similar News