Manish Sisodia: మనీష్‌ సిసోడియాపై మరో అవినీతి కేసు

Manish Sisodia: సిసోడియాతో పాటు మరికొందరిపై కేసు నమోదు

Update: 2023-03-16 08:46 GMT

Manish Sisodia: మనీష్‌ సిసోడియాపై మరో అవినీతి కేసు

Manish Sisodia:  ఢిల్లీ ప్రభుత్వ ఫీడ్‌బ్యాక్ యూనిట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తాజాగా కేసు నమోదు చేసింది. 2015లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్ ఎఫ్‌బీయూని ఏర్పాటు చేసింది. ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను చట్టవిరుద్ధంగా సృష్టించడం, పని చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు 36 లక్షల వరకు నష్టం వాటిల్లిందని సీబీఐ పేర్కొంది. మనీష్ సిసోడియాతో సహా మొత్తం ఏడుగురిపై సీబీఐ కేసు ఫైల్ చేసింది.

2015లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం 'ఫీడ్‌బ్యాక్ యూనిట్'ని ఏర్పాటు చేసినట్లు ఆరోపిస్తూ సిసోడియాపై స్నాపింగ్ కేసు నమోదైంది. ఆ తర్వాత విజిలెన్స్ విభాగానికి సిసోడియా నేతృత్వం వహించారు. ప్రతిపక్ష పార్టీలు, ఇతర వ్యక్తులపై గూఢచర్యం చేయడానికి ఫీడ్‌బ్యాక్ యూనిట్ ఉపయోగించబడిందని ఆరోపణలు వచ్చాయి. 2016లో ఫీడ్‌బ్యాక్ యూనిట్ డిప్యూటేషన్‌లో భాగమైన డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అధికారికి ఫిర్యాదు అందిన తర్వాత ఈ విషయంపై విచారణ ప్రారంభించారు. మనీష్ సిసోడియా ఇప్పటికే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News