ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ ఎంతో తెలుసా..

ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు టాప్ లో నిలిచాయి..

Update: 2020-09-05 11:02 GMT

ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ఆ తరువాత తరువాత రెండో స్థానంలో ఉత్తర ప్రదేశ్ , మూడో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం రాష్ట్ర వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. ఉత్తర భారతదేశం నుండి ఉత్తర ప్రదేశ్, దక్షిణ భారతదేశం నుండి ఆంధ్రప్రదేశ్, తూర్పు భారతదేశం నుండి పశ్చిమ బెంగాల్, పశ్చిమ భారతదేశం నుండి మధ్యప్రదేశ్ , ఈశాన్య భారతదేశం నుండి అస్సాం మొదటి స్థానంలో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీ కి మొదటి స్థానం లభించింది.

ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, కేబినెట్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు. ఈ ర్యాంకింగ్ వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఆధారపడి ఉందని పియూష్ గోయల్ చెప్పారు. మరోవైపు సంస్కరణలపై భారతదేశం యొక్క స్థిరమైన నిబద్ధత కారణంగా ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో 2014 లో 142 వ ర్యాంక్ నుండి 2019 లో 63వ ర్యాంక్ కు చేరిందని గోయల్ చెప్పారు.

Tags:    

Similar News