బిహార్‌ పోలింగ్‌: కరోనాతో స్వతంత్ర అభ్యర్థి మృతి!

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఇవాల్టీతో ముగిశాయి. చివరి దశలో 19 జిల్లాల్లో 78 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ సీట్లకు వెయ్యి 2వందల 4 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

Update: 2020-11-07 11:53 GMT

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఇవాల్టీతో ముగిశాయి. చివరి దశలో 19 జిల్లాల్లో 78 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ సీట్లకు వెయ్యి 2వందల 4 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. పోలింగ్ సమయం 5 గంటలకే ముగిసినప్పటికీ.. క్యూలైన్లో నిలబడిన వారికోసం.. కొవిడి పేషంట్ల కోసం పోలింగ్‌ సమయం 6గంటల వరకు పొడిగించారు. చివరి విడత ఎన్నికల్లో 2కోట్ల 34లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మధ్యాహ్నం 3గంటల వరకు 45శాతం పోలింగ్ నమైదైనట్లు పోలింగ్ అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఇప్పటివరకు సహస్ర జిల్లాలో అత్యధికంగా 48.98శాతం ఓటింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా మధుబని జిల్లాలో 36.23శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. అయితే మొదటి రెండు దశలతో ఓటింగ్ పోలిస్తే మూడో దశలో ఓటింగ్ ఓటింగ‌్ తగ్గిందని చేప్పాలి.. తొలి దశలో 55.69శాతం, రెండో దశలో 53.51శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక చివరి విడత ఎన్నికల్లో నితీష్‌ సహా 12మంది ప్రముఖులు పోటీలో నిలబడ్డారు. రెండో దశ పోలింగ్‌లో తేజస్వి యాదవ్‌ పోటీలో నిలిచారు.

సంతత్ర అభ్యర్ది కరోనాతో మృతి..

మూడో దశ ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ ఓ స్వతంత్ర అభ్యర్థి కరోనాతో మృతి చేందాడు.. బేనిపట్టి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సంతత్ర అభ్యర్దిగా బరిలోకి దిగిన నీరజ్‌ ఝాకి ఇటివల కరోనా సోకడంతో ఎయిమ్స్‌ అసుపత్రిలో చేరాడు.. అక్కడ చికిత్ప పోందుతూ ఈ రోజు మృతి చేందాడు.. నీరజ్‌ ఝాకి ఎన్నికల సమయంలోనే అనారోగ్యానికి గురైయ్యాడు.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నాడు..

Tags:    

Similar News