ఉక్రెయిన్ , రష్యా యుద్ధంతో దేశంలో భారీగా పెరిగిన వంట నూనె ధరలు

*మూడు రోజుల్లో లీటరు వంట నూనెపై రూ.12 పెరుగుదల

Update: 2022-02-25 06:45 GMT

ఉక్రెయిన్ , రష్యా యుద్ధంతో దేశంలో భారీగా పెరిగిన వంట నూనె ధరలు 

Oil Prices: ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఇప్పటికే చమురు ధరలు ఆకాశన్నంటాయి. ఇక దేశంలో వంట నూనెల ధరలు కూడా భారీగా పెరిగాయి. గడిచిన మూడు రోజుల్లో లీటర్ వంట నూనెపై 12 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ విజయ సన్ ఫ్లవర్ ఆయిల్ బహిరంగ మార్కెట్‌లో 180 రూపాయలు, విజయ పల్లి నూనె 175 రూపాయలు, పామాయిల్ 178 రూపాయలు, రైస్ బాన్డ్ ఆయిల్ 165 రూపాయలుగా ఉంది. రానున్న రోజుల్లో మరింత పెరుగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. 

Tags:    

Similar News