Bihar: బీహార్‌లో అమానుష ఘటన.. మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించిన దుండగులు..

Bihar: బలవంతంగా మూత్రం తాగించారని ఆరోపించిన బాధితురాలు

Update: 2023-09-25 06:25 GMT

Bihar: బీహార్‌లో అమానుష ఘటన.. దళిత మహిళను వివస్త్ర చేసి మూత్రం తాగించారు

Bihar: బీహార్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో జరిగిన మూత్ర విసర్జన తరహా ఘటన పాట్నాలో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను వివస్త్రను చేసి, మూత్రం తాగించి మృగాల్లా వ్యవహరించారు దుండగులు. తీసుకొన్న పదిహేను వందల అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యక్తులు వేధించినట్లు ఓ మహిళ ఆరోపించింది.

అంతటితో ఆ ఉదంతాన్ని ఆపివేయకుండా ఆమెను వివస్త్రను చేసి, కర్రలతో దాడిచేశారని బాధితురాలు ఆరోపించింది. బలవంతంగా మూత్రం తాగించారని తెలిపింది. ప్రస్తుతం గాయాలతో బాధిత మహిళ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. పాట్నా జిల్లా ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News