Amit Shah: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌‌కౌంటర్‌పై అమిత్‌ షా ట్వీట్‌

Amit Shah: అమరులైన జవాన్ల ప్రాణత్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేం- అమిత్ షా * జవాన్ల ధైర్యాన్ని కొనియాడిన అమిత్‌ షా

Update: 2021-04-04 06:30 GMT

అమిత్ షా ఫోటో ట్విట్టర్ 

Amit Shah: పచ్చని అడవుల్లో మళ్లీ తుపాకుల మోత దద్దరిల్లుతోంది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులతో ఛత్తీస్‌గఢ్‌లోని తార్రెమ్‌లో రక్తపాతం మొదలైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఆరుగురు పోలీసులు అమరులుకాగా ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుంది. అయితే ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు బీజాపూర్‌ పోలీసులు.

మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించాయి. ఎన్‌కౌంటర్‌ సమయంలో మావోయిస్టులు 1500 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక నిన్నటి నుండి జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లో మరో 30 మందికిపైగా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే ఎన్‌కౌంటర్‌ తర్వాత 21 మంది జవాన్ల ఆచూకీ తెలియడం లేదు. ఇక తప్పిపోయిన జవాన్ల కోసం మిగతా సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. అమరులైన జవాన్ల ప్రాణత్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. జవాన్ల ధైర్యం ఎంతో గొప్పదన్నారు అమిత్‌ షా.


Full View


Tags:    

Similar News