జెడ్ క్యాట‌గిరీ భ‌ద్ర‌త‌ను ఓవైసీ అంగీక‌రించాలని కోరుతున్నా: అమిత్ షా

Attack on Asaduddin Owaisi: ఎఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై కాన్వాయ్‌పై కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు.

Update: 2022-02-07 10:11 GMT

జెడ్ క్యాట‌గిరీ భ‌ద్ర‌త‌ను ఓవైసీ అంగీక‌రించాలని కోరుతున్నా: అమిత్ షా 

Attack on Asaduddin Owaisi: ఎఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై కాన్వాయ్‌పై కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. ఓవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పార్లమెంట్‌లో తెలిపారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు అమిత్‌ షా తెలిపారు. తన ప్రయాణ షెడ్యూలును ఓవైసీ తమకు ఇవ్వలేదని తెలిపారు. దాడులకు ముందు కూడా భద్రతను ఓవైసీ తిరస్కరించినట్టు వెల్లడించారు. అసదుద్దీన్‌ ఓవైసీ భద్రతను తీసుకోవాలని కోరుతున్నట్టు హోం మంత్రి అమిత్‌షా తెలిపారు.

యూపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఓవైసీ కారుపై మీరట్‌లో టోల్‌ ప్లాజా వద్ద దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఎవరూ గాయపడలేదు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. అయితే జెడ్‌ కేటగిరీ భద్రత తనకు అవసరం లేదని అసదుద్దీన్‌ ఓవైసీ తిరస్కరించారు. తనకు భద్రత కాదు న్యాయం కావాలని ఓవైసీ పార్లమెంట్‌లో కోరారు. 

Tags:    

Similar News