Chhattisgarh BJP Manifesto: ఛత్తీస్‌గఢ్‌ మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ.. మహిళలకు రూ.12,000

Chhattisgarh BJP Manifesto: కొత్తగా 500 కొత్త జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభం

Update: 2023-11-03 13:59 GMT

Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్‌ మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ.. మహిళలకు రూ.12,000

Chhattisgarh BJP Manifesto: ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఛత్తీస్‌గఢ్‌ను అత్యున్నత రాష్ట్రంగా తీర్చి దిద్దడమే తమ లక్ష్యమని అమిత్ షా అన్నారు. మూడు నెలల్లోనే ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టు మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ విజయ్ బఘేల్ బోల్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. 2 లక్షలకు పైగా సూచనలు వచ్చినట్టు బఘేల్ బోల్ వివరించారు.

వివాహమైన ప్రతి మహిళలకు ఏటా 12 వేల రూపాయలు.. ప్రధానమంత్రి హౌసింగ్ స్కీమ్ కింద 18 లక్షల ఇల్లు ఇచ్చేందుకు పథకం రూపొందించారు. ఆయుష్మాన్ భారత్ యోజన, ఆరోగ్య పథకం కింద 10 లక్షల వరకూ అందజేసే పథకం, 500 కొత్త జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. వీటితో పాటు 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం ఉచితంగా కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

Tags:    

Similar News