Conona Effect On Independence Day: సాదాసీదాగా స్వాతంత్య్ర వేడుకలు
Conona Effect On Independence Day: దేశంలో కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని చాలా సాధారణంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
Conona Effect On Independence Day: దేశంలో కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని చాలా సాధారణంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ ని అధికారులు విడుదల చేశారు. శనివారం ఉదయం7:21 నిమిషాలకు ప్రధాని ఎర్రకోటకు చేరుకుంటారు. సరిగ్గా 7:30 నిమిషాలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.అనంతరం దేశప్రజలనుద్దేశించి .. సుమారు 40 నుంచి 90 నిమిషాల పాటు ఆయన ప్రసంగిస్తారని సమాచారం. మాములు రోజుల్లో అయితే... త్రివిధ దళాలకు చెందిన జవాన్లు భారీ సంఖ్యలో గౌరవ వందనం ఇస్తారు. ఈసారి మాత్రం కేవలం 22 మంది జవాన్లతోనే గౌరవ వందన కార్యక్రమం ఉంటుంది.
అలాగే నేషనల్ సెల్యూట్ లో 32 మంది సైనికులు పాల్గొంటారు. 350 మంది ఢిల్లీ పోలీసులను నాలుగు వేర్వేరు లైన్లలో భౌతిక దూరం పాటింఆయచేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి కేవలం 120 మంది గెస్టులను మాత్రమే ఆహ్వానించారు. స్కూలు విద్యార్థులెవరూ పాల్గొనడంలేదు. ఒక్కో వరుసలో కేవలం 60 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక... ప్రధాని మోదీని అతి దగ్గరి నుంచి ఫొటో తీసే ఫొటో జర్నలిస్టులపై కూడా తగు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రధాని మోదీని ఫొటో తీసే జర్నలిస్టులందరూ కోవిడ్ టెస్టులు విధిగా చేసుకోవాల్సిందేనని సూచించారు. ఇక రిపోర్టర్లకు కూడా కొద్ది సంఖ్యలోనే పాసులకు అనుమతించారు.