రష్యా నుంచి 33 యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన

గాల్వన్ లోయలో సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ప్రభావం ఇప్పుడు భారత రక్షణ విధానాలపై స్పష్టంగా కనిపిస్తుంది.

Update: 2020-06-19 06:29 GMT

గాల్వన్ లోయలో సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ప్రభావం ఇప్పుడు భారత రక్షణ విధానాలపై స్పష్టంగా కనిపిస్తుంది. భవిశ్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా రష్యా నుంచి కొత్తగా 33 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని భారత వైమానిక దళం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనుంది. ఈ ఫైటర్ జెట్లలో మిగ్ 21 -29 ,12 సుఖోయ్ , 30 ఎంకెఐలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనపై కొంతకాలంగా వైమానిక దళం కసరత్తు చేస్తోందని.. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI పేర్కొంది.

ఈ విమానాల కొనుగోలు ఖర్చు సుమారు 6 వేల కోట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన మంత్రిత్వ శాఖ ముందు ఉంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక రష్యా నుండి కొనుగోలు చేసే మిగ్ -29 లు ఎక్కువ కాలం పనిచేయగలవా అని తెలుసుకోవడానికి ఎయిర్‌ఫోర్స్ కూడా ఒక అధ్యయనం చేయాలని నిర్ణయించింది.


Tags:    

Similar News