అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ షాకింగ్ నిర్ణయం

* అమెజాన్ సీఈవోగా తప్పుకుంటానని ప్రకటన * షాక్‌ అవుతున్న అమెజాన్ వర్కర్లు, వినియోగదారులు * బెజోస్ తర్వాత అమెజాన్ సీఈవోగా ఆండీ జాసీ

Update: 2021-02-03 02:23 GMT

Amazon founder Jeff Bezos

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ సీఈవోగా త్వరలో తప్పుకుంటానని ప్రకటించారు. అమెజాన్‌ను లాభాల్లో బాటలో పరుగెత్తించిన జెఫ్‌ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన రిటైర్‌మెంట్‌ వార్త బయటకు రాగానే అమెజాన్‌ వర్కర్స్, వినియోగదారులు షాక్‌ అవుతున్నారు. అయితే బెజోస్ తర్వాత అమెజాన్ సీఈవోగా ఆండీ జాసీని నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి ఆండీ అమెజాన్ వెబ్ సర్వీసుల హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు జెఫ్ బెజోస్ అమెజాన్ వర్కర్లకు ఓ లేఖ రాశారు. సీఈవోగా తప్పుకున్నప్పటికీ అడ్వైజర్‌గా కొనసాగుతానని ఈ లేఖలో పేర్కొన్నారు. రిటైర్‌మెంట్ తర్వాత సేవాకార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News