Amarnath Yatra: రెండో ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్ర రద్దు
Amarnath Yatra: కోవిడ్ -19 నేపథ్యంలో అమర్‌నాధ్ యాత్రను వరుసగా రెండో ఏడాది కూడా అధికారులు రద్దు చేశారు.
Amarnath Yatra: దేశంలో కోవిడ్-19 నేపథ్యంలో అమర్‌నాధ్ యాత్రను వరుసగా రెండో ఏడాది కూడా అధికారులు రద్దు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సారధ్యంలో సోమవారం జరిగిన అమర్‌నాధ్ ఆలయ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది కూడా అమర్‌నాధ్ యాత్రను రద్దు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే.. వర్చువల్‌లో పూజా కార్యక్రమాలను చూడొచ్చని అమర్‌నాథ్ బోర్డు పేర్కొంది. 56 రోజులపాటు జరిగే అమర్‌నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమై ఆగష్టు 22న ముగుస్తుంది.
అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినా.. ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం అన్ని పూజా క్రతువులు యథావిథిగా జరగనున్నాయి. పవిత్ర పర్వత గుహల్లో కొలువు తీరిన ఆలయంలో నిత్య క్రతువులు నిర్వహిస్తామని ఆలయ బోర్డు సమావేశానంతరం ఎల్జీ మనోజ్ సిన్హా పేర్కొన్నారు. ఆలయ బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమర్‌నాధ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజాఆరోగ్యం దృష్ట్యా.. ఈ యాత్రను నిర్వహించడం సరైంది కాదని సిన్హా ట్వీట్ చేశారు.