COVID-19 Relief Fund: యాచకుడే.. కరోనా నిధికి రూ. లక్ష విరాళం ఇచ్చాడు!
COVID-19 Relief Fund: కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి.. ఈ పోరాటంలో ప్రభుత్వాలకు
COVID-19 Relief Fund: కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి.. ఈ పోరాటంలో ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు కొందరు.. తమవంతుగా సహాయంగా విరాళాలు ప్రకటిస్తూ తోడుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినీ రాజకీయ, క్రీడా ప్రముఖులు ముందుకు వచ్చి భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చారు. ఇక ఇలాంటి విపత్కరమైన సమయంలో సామాన్యులు కూడా ముందుకు వచ్చి సమాజం పట్ల తమకి ఉన్న ఔదర్యాన్ని చూపించారు.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా తమిళనాడుకు చెందిన ఒక యాచకుడు తన వంతు బాధ్యతగా కరోనా సహాయ నిధికి గాను రూ. లక్ష విరాళం ఇచ్చాడు. అయితే అతడి చేసిన సహాయం పట్ల ప్రతి ఒక్కరు అతన్ని అభినందిస్తున్నారు.. అతని గొప్ప మనసును ప్రశంసించిన కలెక్టర్ సామాజిక కార్యకర్త అన్న బిరుదుతో సత్కరించడం మరో విశేషం.. ఇంతకి అతని పేరు ఏంటి అంటే పూల్‌పాండియన్.. ఇతను మదురైకు చెందినవాడు..
కరోనా మహమ్మారితో పలువురు మరణించడాన్ని చూసి చలించిపోయాడు పూల్‌పాండియన్ . అప్పుడే అతనిలోని మానవత్వం బయటకు వచ్చింది.. ముందుగా తన వంతు సహాయంగా మే నెలలో రూ. పది వేల విరాళం ఇవ్వగా.. ఇక మరో మూడు నెలల్లో భిక్షాటన ద్వారా రూ.90 వేలను సేకరించాడు. ఇలా సేకరించిన డబ్బును మంగళవారం మదురై కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి విరాళంగా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
ఇక తమిళనాడులో సోమవారం కొత్తగా 536 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 11,760 గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.